VKB: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణన కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల కేంద్రంలో పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో విడత శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరానికి మండల తహసీల్దార్ పురుషోత్తం హాజరై, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు విధివిధానాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో బాధ్య తాయుతంగా పనిచేయాలని సూచించారు.