MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో 436 చెక్కులను నేడు అందజేయడం జరిగిందన్నారు.