MDK: నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. 4, 6 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపూర్లో బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు.