MLG: పాలంపేటలోని రామప్ప దేవాలయంను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. ఈడీ ఎస్కే గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు సోమవారం ఆలయాన్ని దర్శించారు. అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవంపై టూరిజం గైడ్ వివరించారు. అనంతరం అధికారులు రామప్ప చెరువును కూడా సందర్శించారు.