ADB: అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను చేర్పించి వాటి బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ICDS అర్బన్ CDPO సౌందర్య అన్నారు. ఆదిలాబాద్‌లోని తిలక్ నగర్ అంగన్వాడీ-2 కేంద్రంలో సోమవారం గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించి పూర్వ బాల్య దశ పూర్తయిన చిన్నారులకు పట్టాలను అందజేశారు. అంగన్వాడీలో చదువుతోపాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.