SRPT: మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ పనులను సర్పంచ్ వెంకటాద్రి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.