TG: BRS అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన ఆందోళనల వేళ నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల నుంచి విముక్తి లభించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.