BDK: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఏప్రిల్ 27న కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన వినతులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.