AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ముఖ్యంగా మార్కాపురం, నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, కర్నూలు, పల్నాడు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 43 డిగ్రీలతో భానుడు భగభగలాడుతున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.