KMR: బిబిపేట్ మండల కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా, ఆదివారం రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంల, భక్తిశ్రద్ధలతో రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సంఘ సభ్యులు భజనలు చేస్తూ రథయాత్రలో పాల్గొనగా, పట్టణవాసులు అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు. రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది.