WNP: అమరచింత మండల అభివృద్ధికి సహకరించాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. నూతన మండలంగా ఏర్పడిన అమరచింత విద్యా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉందని తెలిపారు. కొత్త పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేసి ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో పలుపార్టీల నాయకులు పాల్గొన్నారు.