ADB: జనాభా గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మొదటి దశలో ‘ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (HLO)’ చేపడతారన్నారు. రెండో దశ గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు సహా మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.