KNR: చొప్పదండి నియోజక వర్గం గంగాధర మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, ఆలయ కమిటీ సభ్యులతో సన్మానించారు.