KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు కూసుమంచిలో నిర్వహించాల్సిన ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడింది. హైదరాబాద్‌లో అత్యవసర ప్రభుత్వ సమావేశాల కారణంగా దీనిని ఈ నెల 29న (బుధవారం) నిర్వహించనున్నారు. మండల ప్రజలు ఈ సమయ మార్పును గమనించి, బుధవారం జరిగే దర్బార్‌కు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు.