AP: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు మహాద్వారం వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ నాయుడు రంగనాయక మండపంలో వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.