ADB: బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపేట కాలనీలో గొడవను ఆపడానికి వెళ్లిన పోలీసులపై తిరగబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు SI రమేష్ ఆదివారం తెలిపారు. ఈనెల 24న డయల్ 100కు అందిన సమాచారం మేరకు గొడవను ఆపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో నిందితులు తిరగబడినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.