KNR: మున్సిపల్ కార్పొరేషన్లో కో-ఆప్షన్ ఎన్నికలు గోప్యంగా, చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తూ BJP ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. అభ్యర్థుల వివరాలు ప్రకటించకుండా ఎన్నికలు జరపడం అన్యాయమని, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.