E.G: రాజమండ్రి లింగంపేట, తుమ్మలోవ పరిసర ప్రాంతాలలో కమిషనర్ రాహుల్ మీనా శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. తొలుత ఏబీ నాగేశ్వరరావు పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో కాసేపు సరదాగా ముచ్చటించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు గురైన జిమ్ పరికరాలు, ఆట వస్తువులతో పాటు గార్డెనింగ్ పైపులైన్లను బాగు చేయించాలన్నారు.