MBNR: నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ పొందాలనుకున్న యువతీ యువకులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉండాలన్నారు.