KRNL: కౌతాళం మండలం వ్యవసాయ అధికారి కార్యాలయం సోమవారం మధ్యాహ్నం 1గంట దాటినా తెరుచుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహం నెలకొంది. పలు వ్యవసాయ సంబంధిత పనుల కోసం కార్యాలయానికి వచ్చిన, కార్యాలయం మూసి ఉండటంతో రైతులు నిరాశకు గురయ్యారు. రైతులకు సేవలు అందించాల్సిన కార్యాలయం సమయానికి అందుబాటులో లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని సీపీఎం మండల నాయకులు మల్లయ్య విమర్శించారు.