సత్యసాయి: ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టర్ శ్యాంప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు సి.రాజారెడ్డి, మడకశిర వైసీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.