TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల పెట్రోల్, డీజీల్ కొరత ఏర్పడింది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మనోహరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కౌడిపల్లి మండలంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వరి కోతలు మొదలు కావడంతో పలుచోట్ల డీజిల్ కోసం పెట్రోల్ బంకులకు రైతులు డబ్బాలతో క్యూ కట్టారు.