HNK: పదో తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా విద్యార్థులు అధైర్యం చెందకూడదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మంగళవారం సూచించారు. మార్కులు మాత్రమే ప్రతిభకు ప్రమాణం కాదని, కష్టపడి చదివితే ఉన్నత విద్యలో విజయాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కుల విషయంలో నిరుత్సాహపరచకుండా వారికి మనోధైర్యం కల్పించాలని ఆమె కోరారు.