TG: HYD మెట్రోరైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ(L&T) సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తి కావడంతో ఈ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా సుమారు రూ.1,461.47 కోట్ల విలువైన షేర్లు ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. ఇకపై మెట్రోరైల్ కార్యకలాపాలు, నిర్వహణ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి.