సూర్య హీరోగా వస్తున్న ‘కరుప్పు’ మూవీ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రమోషనల్ పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడంపై దర్శకుడు ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చాడు. సెన్సార్ పరంగా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశపూర్వకంగా తేదీని ప్రకటించలేదని, అయితే మూవీని 2026 మే 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కు రెడీగా ఉండాలని చెప్పాడు.