MDCL: అల్వాల్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పవన్ కుమార్ హెచ్చరించారు. మంగాపురం కాలనీ-సుచిత్ర రోడ్డుపై పోలీసులు తనిఖీలు చేసి, కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్లను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్లు ఉన్న వాహనాలపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కిషోర్, నవీన్ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.