TPT: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 110 వినతులు నమోదయ్యాయి. భూ, మున్సిపల్, హౌసింగ్ సమస్యలు అధికంగా ఉన్నాయి. తహసీల్దార్ పరిధిలో 36, ఎంసీడీఓ 21, మున్సిపల్ కమిషనర్ 12 వినతులు వచ్చాయి. సమస్యలను గడువులోగా పరిష్కరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా హౌసింగ్, విద్యుత్, ఐసీడీఎస్ వంటి శాఖల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.