సత్యసాయి: కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ నల్లమాడ మండలం కొండిగానిగుట్ట వంకలో సాగుతున్న ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను శుక్రవారం తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రతి చెరువుకు నీరు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటి మళ్లింపు మార్గాలను మెరుగుపరిచాలని అన్నారు.