MLG: గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి కీలకమని కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో కార్యక్రమం నిర్వహించారు. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీరాజ్‌కు రాజ్యాంగబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు నిర్వహించి పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.