మోకాళ్లు, మోచేతుల నలుపును ఇంట్లోని వస్తువులతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. నిమ్మకాయ-చక్కెర స్క్రబ్, బంగాళాదుంప రసం నలుపును వదిలిస్తాయి. బేకింగ్ సోడా, పాలు కలిపి రాస్తే చర్మంపై మురికి పోతుంది. కలబంద, కొబ్బరి నూనె రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడితే చర్మం కాంతివంతంగా మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.