కోనసీమ: అమలాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న మండల అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తీసుకుని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు అందజేస్తామన్నారు.