TG: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నిర్వహించే TGRJC CET 2026 హాల్టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్లో తమ హాల్టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, మే 3న పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒక ఫొటో ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.