ఫేక్ న్యూస్, పెయిడ్ PRపై నటి ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రూ.18 కోట్ల అప్పు తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని, కొందరు కావాలనే ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. తాను పెయిడ్ మీడియాను ప్రోత్సహించనని, సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో టచ్లో ఉంటానని వెల్లడించింది. లైకులు, ఫాలోవర్లను కొనడం వ్యాపారంగా మారిందని అసహనం వ్యక్తం చేసింది.