ADB: ఉట్నూర్ మండలంలోని ఉమాపతికుంట గ్రామంలో ఇప్పపువ్వు కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, క్వింటాలు రూ.3,000 ధర నిర్ణయించినట్లు సేల్స్ మెన్ ప్రఫుల్ తెలిపారు. ప్రభుత్వం నేరుగా కొనుగోళ్లు చేపట్టడం పట్ల అటవీ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సేకరణతో మంచి ధర పొందవచ్చని అధికారులు సూచించారు.