JN: చిల్పూర్ మండలం పత్తెపూర్ గ్రామంలోని PACS వడ్ల కొనుగోలు కేంద్రాన్ని CPM మండల కార్యదర్శి సాదం రమేష్ సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 20 రోజులుగా ఒక్క లారీలో కేవలం 700 బస్తాలు మాత్రమే తరలించడంతో మిగిలిన వడ్లు ఎప్పుడు తీసుకెళ్తారో అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన కోరారు.