రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముందుగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నిర్మాణ పనుల జాప్యం వల్ల వాయిదా పడింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, జూన్ 4న కూడా ఈ సినిమా వచ్చే అవకాశం లేదట. జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూన్ 24 రాత్రి నుంచే భారీగా ప్రీమియర్స్ పడే అవకాశం ఉందట.