KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మహిళల ఆర్థికాభివృద్ధికి నిర్వహిస్తున్న యూనిఫాం స్టిచింగ్ శిక్షణ గురువారంతో ముగిసింది. 4వ రోజు శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది మహిళలకు మేయర్ కోలగాని శ్రీనివాస్ మెప్మా పీడీ జి.స్వరూపరాణి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు నైపుణ్యాలను మెరుగు పరుచుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని అన్నారు.