WGL: పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడటం చాలా విచారకరం అని PRTU తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ అన్నారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే భాధ్యత వహించాలని, ప్రభుత్వం వెంటనే రూ. 2 కోట్లు ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.