శ్రీకాకుళం మండలం అరసవల్లిలో వెలసి ఉన్న ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత శ్రీసూర్యనారాయణ స్వామివారిని, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ దండ శ్రీనివాసరావు (విశాఖపట్నం) ఇవాళ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలను పాటించి, సాదరంగా ఆహ్వానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి పాల్గొన్నారు.