KMM: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మల్లాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ తారక్ కుటుంబానికి సీఎం సహాయ నిధి అండగా నిలిచింది. సర్పంచ్ నరేష్, తుంబూరి దయాకర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తక్షణమే స్పందించి రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు. కష్టకాలంలో తమను ఆదుకున్న మంత్రికి, సహకరించిన నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.