CTR: ఆర్యవైశ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాసవి అమ్మవారి జయంతిని ఈనెల 26న పలమనేరులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థలు మూసివేస్తున్నట్లు ఆర్య వైశ్యులు తెలిపారు. తమ కుల దైవం వాసవి మాత జయంతి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నందున తమ వ్యాపార సంస్థలను మూసి వేస్తున్నట్లు వారు తెలిపారు.