VSP: వీఆర్ఎస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంపై ఉక్కు యాజమాన్యానికి ఉద్యోగులు లీగల్ నోటీసు పంపారు. వీఆర్ఎస్ ఉద్యోగులకు పూర్తి పరిహారం, లీవ్ ఎన్క్యాష్మెంట్, పెండింగ్ జీతాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 130 మంది ఉద్యోగులు న్యాయవాది వి. శ్రీనివాసమూర్తి ద్వారా నోటీసు పంపిస్తూ, 7 రోజుల్లో 12% వడ్డీతో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.