గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ మూవీపై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సాధారణంగా పురుష దర్శకులే ఇలాంటి చిత్రాలు తీస్తారనే భావన ఉంటుంది, కానీ ఒక మహిళా కోణంలో ఈ కథను చూడటం కొత్తగా ఉంటుంది. యాక్షన్ నుంచి ఎమోషన్స్ వరకు గీతూ స్పష్టత, ఆమెలోని గొప్ప రచయిత నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సరికొత్త అనుభూతిని చూస్తారు’ అని తెలిపాడు.