జియో ప్లాట్ఫామ్స్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.7,935 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వినియోగదారుల సగటు ఆదాయం(ARPU) రూ.214కు పెరగడం కంపెనీకి కలిసివచ్చింది. ప్రస్తుతం జియోకు 52.44 కోట్ల కస్టమర్లు ఉండగా, అందులో 26.8 కోట్లు(55%) మంది 5జీ వాడుతున్నారు. జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ/లిస్టింగ్ దిశగా స్థిరంగా సాగుతోందని ముకేశ్ అంబానీ తెలిపారు.