AP: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. గతంలో సేకరించిన ఆధారాల ఆధారంగా కీలక అంశాలపై ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. అక్రమ ఆస్తులు, విధుల్లో నిర్లక్ష్యంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.