అనంతపురం జిల్లా తుమ్మల గ్రామానికి చెందిన వ్యక్తికి బాలికపై అత్యాచారం చేసిన కేసులో పదేళ్ల జైలుశిక్ష పడింది. శివశంకర్ 2017లో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కూకట్పల్లి కోర్టు న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 11 వేల రూపాయల జరిమానా విధించారు.