సత్యసాయి: పుట్టపర్తిలో రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జేసే మౌర్య భరద్వాజ్ ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సర్వే నోటీసులు రైతులకు సకాలంలో అందజేయాలని, గ్రామాల్లో చాటింపు ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.