MLG: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల అండర్-17 విభాగంలో ములుగుకు చెందిన రోహిత్ కాంస్య పతకం సాధించాడు. ములుగు జిల్లా యువజన క్రీడల శాఖ ట్రైనింగ్ సెంటర్లో ఆయన శిక్షణ పొందుతున్నాడు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన రోహిత్‌ను ములుగు రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నూనేటి శ్యామ్ శుక్రవారం శాలువాతో సన్మానించారు.