AP: కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అవసరానికి మించి కొనుగోలు చేయడంతోనే కొరత ఏర్పడిందని వెల్లడించారు.