RR: కొందుర్గు మండలం తంగళ్లపల్లి గ్రామంలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టారు. వేసవికాలం కావడంతో కరెంటు సరఫరాకి అంతరాయం వాటిల్లకుండా ఆరవ వార్డులో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ కష్టాల నుంచి ఉపశమనం కల్పించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.